by Suryaa Desk | Fri, Jan 17, 2025, 11:36 AM
బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నేడు షాబాద్‌లో నిర్వహించే రైతుధర్నాను విజయవంతం చేయాలని కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి, బీఆర్‌ఎస్ యువనేత పట్నం అవినాశ్‌రెడ్డి పిలుపునిచ్చారు. గురువారం రంగారెడ్డి జిల్లా షాబాద్ మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద రైతుధర్నాకు సంబంధించిన సభ స్థలాన్ని, ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… శుక్రవారం ఉదయం 11గంటలకు షాబాద్ మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో నిర్వహించే రైతుధర్నా కార్యక్రమానికి బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి సబితాఇంద్రారెడ్డి, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎంపీలు, పార్టీ శ్రేణులు హాజరుకానున్నట్లు తెలిపారు.