by Suryaa Desk | Fri, Jan 17, 2025, 04:13 PM
డిండి రెవిన్యూ ఇన్స్పెక్టర్ శ్యాం నాయక్ హైదారాబాద్ లో ఏసీబీకి పట్టుబడ్డాడు. పడమటితండాకు చెందిన పాండు నాయక్ కూతురు కళ్యాణలక్ష్మి ఫైల్ విషయంలో ఆర్ఐ రూ. 10 వేలు లంచం డిమాండ్ చేయడంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు. శుక్రవారం హైదారాబాద్ లో పాండు నాయక్ నుండి ఆర్ఐ ఐదు వేల రూపాయలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ వలకు చిక్కాడు. కాగా ఆర్ఐ గతంలో పీఏ పల్లి మండలంలో పనిచేస్తున్న సమయంలో లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు.