by Suryaa Desk | Thu, Jan 16, 2025, 04:01 PM
ఈడీ కార్యాలయం వద్ద అరెస్టు చేసిన పలువురు బీఆర్ఎస్ నేతలను కంచన్ బాగ్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. వారిలో పల్లెరవికుమార్ గౌడ్, క్రిశాంక్, సుమిత్రానంద్, పావని గౌడ్, కీర్తిలత గౌడ్, తదితరులు ఉన్నారు. కాగా, బీఆర్‌ఎస్ శ్రేణులపై పోలీసుల జులుంపై బీఆర్‌ఎస్ నేతలు దాసోజు శ్రవణ్ కుమార్, పల్లె రవికుమార్ మండిపడ్డారు. ఈడీ విచారణకు హాజరైన కేటీఆర్‌కు సంఘీభావం తెలిపేందుకు వచ్చిన మాపై పోలీసులు ప్రవర్తించిన తీరు సరిగా లేదన్నారు. శాంతియుతంగా నిరసనలు తెలుపుతుంటే అక్రమ అరెస్టులు ఏంటని ప్రశ్నించారుపోలీసులు తమ తీరు మార్చుకోవాలని హితవు పలికారు. అలాగే బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఈడీ కార్యాలయం వద్ద మీడియాతో మాట్లాడుతుండగా అదుపులోకి తీసుకున్నారు. కాగా, బషీర్‌బాగ్ ఈడీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత పరిస్థితుల నెలకొన్నాయి. ఫార్ములా-ఈ కార్ రేస్ వ్యవహారంలో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ఈడీ విచారణకు హాజరైన నేపథ్యంలో ఈడీ ఆఫీస్‌కు భారీ ఎత్తున బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు చేరుకున్నారు. దీంతో బీఆర్‌ఎస్ నేతలు, పోలీసుల మధ్య తోపులాట చోటు చేసుకుంది. బీఆర్‌ఎస్ నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు.