by Suryaa Desk | Thu, Jan 16, 2025, 03:42 PM
మధిర మండలం సిరిపురంలో తహశీల్దార్ రాంబాబు, ఎంపీడీవో వెంకట్ నేతృత్వంలో గురువారం రేషన్ కార్డుల సర్వేను నిర్వహించారు. గ్రామంలో రేషన్ కార్డులకు దరఖాస్తులు చేసిన వారి వివరాలను సేకరిస్తున్నారు. అర్హులైన వారికి రేషన్ కార్డులు అందించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందన్నారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం సర్వే, క్షేత్రస్థాయిలో దరఖాస్తులను పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.