by Suryaa Desk | Thu, Jan 16, 2025, 07:33 PM
మహారాష్ట్రలోని ఔరంగాబాద్ వద్ద గురువారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. యాత్రికులతో వెళ్తున్న తుఫాన్ వాహనం.. అదుపుతప్పి ట్రాక్టర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అక్కడికక్కడే నలుగురు ప్రాణాలు కోల్పోయారు.సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. మరో 10 మంది తీవ్రంగా గాయపడడంతో, వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. బాధితులంతా యాదాద్రి భువనగిరి జిల్లాలోని కొండగడప గ్రామానికి చెందిన వారు. షిరిడి దైవ దర్శనానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు నిర్ధారించారు. ఇక నలుగురు మృతులు ఒకే కుటుంబానికి చెందిన వారని పోలీసుల విచారణలో తేలింది. మృతుల నివాసాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.