by Suryaa Desk | Fri, Jan 17, 2025, 01:53 PM
తార్నాక డివిజన్ మాణికేశ్వరి నగర్ మాదిగ సంక్షేమ సంఘం సభ్యులు శుక్రవారం గ్రేటర్ హైదరాబాద్ నగర డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి ని, టిటియుసి రాష్ట్ర అధ్యక్షులు మోతే శోభన్ రెడ్డి ని డిప్యూటీ మేయర్ క్యాంప్ కార్యాలయంలో కలుసుకున్నారు. ఈ సందర్భంగా మాణికేశ్వరి నగర్‌లో డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ విగ్రహం ప్రతిష్ఠ కోసం వినతిపత్రం అందజేశారు. డిప్యూటీ మేయర్ స్పందిస్తూ ప్రభుత్వం తరఫున అవసరమైన అన్ని చర్యలు తీసుకొని విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుందని హామీ ఇచ్చారు.