by Suryaa Desk | Fri, Jan 17, 2025, 03:04 PM
సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు నియోజకవర్గం గుమ్మడిదల మండల కేంద్రంలో రూ. 40 లక్షల నిధులతో చేపట్టనున్న సీసీ రోడ్డు పనులకు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యేని స్థానిక నాయకులు శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో గోవర్ధన్ రెడ్డి, నాయకులు, కార్యకర్తలు, అధికారులు, గ్రామ ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.