by Suryaa Desk | Fri, Jan 17, 2025, 06:46 PM
చిట్యాల మండలం నేరడ గ్రామానికి చెందిన సీపీఎం నాయకులు, ప్రజానాట్యమండలి జిల్లా కళాకారుడు కామ్రేడ్ మందుగుల యాదయ్య(47) శుక్రవారం అనారోగ్యం కారణంగా మరణించటం పట్ల సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు జిట్ట నగేష్, అవిశెట్టి శంకరయ్యలు ఆవేదన వ్యక్తం చేశారు. యాదయ్య మరణం పార్టీకి తీరని లోటని తీవ్ర దిగ్భ్రాంతి, సంతాపం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా కమిటీ సభ్యురాలు జిట్ట సరోజ, మల్లం మహేష్, తదితరులు పాల్గొన్నారు.