by Suryaa Desk | Wed, Jan 22, 2025, 11:27 AM
మండలంలోని బీరప్ప స్వామి విగ్రహ ప్రతిష్టాపన కు ఆత్మకూరు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం మాజీ చైర్మన్ ఏరుకొండ రవీందర్ గౌడ్ తన వంతు సహాయంగా 30 వేల ఆర్థిక సాయం అందజేశారు. రవీందర్ గౌడ్ మాట్లాడుతూ యాదవుల కులస్తులకు బీరన్న దేవాలయానికి ఆర్థిక సాయం అందజేయాలని కోరిన వెంటనే నా వంతు సహాయ సహకారాలు అందిస్తానని చెప్పారు.
ఆత్మకూరు మండలంలోని మూడు గ్రామాలకు ఆత్మకూరు గూడెప్పాడు తిరుమలగిరి గ్రామస్తులకు ఉపయోగపడే విధంగా బీరన్న దేవాలయాన్ని నిర్మిస్తున్నామని కమిటీ చైర్మన్ మంతుర్తి రవి అన్నారు. వైస్ చైర్మన్ మిరియాల కుమార్, సహకార్యదర్శి కాడ వేన రమేష్, కమిటీ సభ్యులు సాంబయ్య, ఓదెలు, రవీందర్, ఐలుకోమురు, నాగన్న, సతీష్ రవి, కుమార్, రాజకుమార్, తదితరులు ఉన్నారు.