by Suryaa Desk | Wed, Jan 22, 2025, 12:21 PM
టీమిండియా స్టార్ ఆటగాడు మహమ్మద్ సిరాజు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ అలాగే రంజిలో రాణించిన మహమ్మద్ సిరాజు… ఏకంగా టీమిండియాలోకి వచ్చాడు. టీమిండియాలోకి వచ్చిన తర్వాత… ప్రత్యర్ధులకు హైదరాబాద్ సత్తా ఏంటో చూపించాడు మహమ్మద్ సిరాజ్. అయితే అలాంటి టీమిండియా ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ సిరాజ్ ( … తాజాగా హైదరాబాద్ ఓల్డ్ సిటీలో మెరిశాడుహైదరాబాద్ ఓల్డ్ సిటీ లోని టోలి చౌక్ ఆర్టీవో ఆఫీస్ కు… తాజాగా మహమ్మద్ సిరాజ్ వచ్చారు. మంగళవారం సాయంత్రం రోజున… తన కొత్త రేంజ్ రోవర్ కారు రిజిస్ట్రేషన్.. నిమిత్తం… టోలిచౌక్ ఆర్టీవో ఆఫీస్ కు రావడం జరిగింది. ఇక… డీఎస్పీ మహమ్మద్ సిరాజు ఆర్టిఓ ఆఫీస్ కు రావడంతో… టోలిచౌక్ ఆర్టీవో కార్యాలయం దగ్గర సందడి వాతావరణం నెలకొంది. అటు మహమ్మద్ సిరాజుకు గ్రాండ్ వెల్కమ్ చెప్పారు అధికారులు. ఆయన కారు రిజిస్ట్రేషన్… దగ్గరుండి చేయించారు. మహమ్మద్ సిరాజ్ కు ఎలాంటి ఇబ్బంది లేకుండా…. కారు రిజిస్ట్రేషన్ చేయించి ఇంటికి పంపించారు.