by Suryaa Desk | Wed, Jan 22, 2025, 11:11 AM
భద్రత పై జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఆదేశాల మేరకు ఎస్సై గణేష్ ఆధ్వర్యంలో పాఠశాలల విద్యార్థులతో రోడ్డు భద్రత పై పట్టణ కేంద్రంలో ర్యాలీ నిర్వహించారు.ఈ సందర్బంగా ఎస్సై గణేష్ మాట్లాడుతూ..వాహనాలు నడిపే ప్రతీ ఒక్కరు డ్రైవింగ్ లైసెన్సు కలిగి ఉండాలని, ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించాలని తొందరపాటుతనంతో నిర్లక్ష్యంగా వాహనాలు నడిపి ప్రమాదాలకు గురి కావద్దన్నారు.
అతి వేగంతో, అజాగ్రత్తగా వాహనాలు నడపడంతో నడిపే వారితో పాటు ఎదుటి వారు కూడా ప్రమాదా లకు గురయ్యే అవకాశం ఉందన్నారు. ప్రతి ఒక్కరు ట్రాఫిక్ నిబంధనలు. పాటించినట్లయితే భవిష్యత్లో రోడ్డు ప్రమాదాలు తగ్గుతాయి అన్నారు.ఈ కార్యక్రమంలో ఎస్ఐ గణేష్ ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.