by Suryaa Desk | Mon, Jan 20, 2025, 07:17 PM
సమిష్టి కృష్టితో ఎల్లారెడ్డి మండలంలో కాంగ్రెస్ బలోపేతం కోసం కృషిచేద్దామని, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు కురుమ సాయిబాబా అన్నారు. సోమవారం ఎమ్యెల్యే క్యాంపు అఫిసులో గ్రామ కమిటీ అధ్యక్షులతో సమావేశం జరిగింది.
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా ప్రతి కార్యకర్త పని చేయాలన్నారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు చేస్తే చర్యలుంటాయన్నారు.