by Suryaa Desk | Sat, Jan 18, 2025, 11:07 AM
నారాయణఖేడ్ గిరిజన బాలుర బాలికల ఆశ్రమ పాఠశాలలో అకాడమిక్ ఇన్స్ట్రక్టర్ గా పరిచేయుటకు ఈనెల 27వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా గిరిజన అధికారి అఖిలేష్ రెడ్డి శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. బాలికల పాఠశాలలో గణితం, తెలుగు, బయో సైన్స్, , బాలుర పాఠశాలలో గణితం, ఆంగ్లం పోస్టులు ఖాళీగా ఉన్నాయని పేర్కొన్నారు. డిగ్రీతోపాటు బి. ఎడ్, టెట్ పేపర్ -1, 2 ఉత్తీనులైన అభ్యర్థులు అర్హులని తెలిపారు.