by Suryaa Desk | Fri, Jan 17, 2025, 06:49 PM
సంక్రాంతి రద్దీ దృష్ట్యా తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల మధ్య దక్షిణ మధ్య రైల్వే పలు ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. వీటికి అదనంగా మరో 8 ప్రత్యేక రైళ్లను పలు ప్రాంతాల మధ్య నడపనున్నట్లు శుక్రవారంనాడు ప్రకటించింది.కాకినాడ టౌన్ – చర్లపల్లి ప్రత్యేక రైలు (నెం.07215)ను జనవరి 18న నడపనుంది. అలాగే నర్సాపూర్ – చర్లపల్లి ప్రత్యేక రైలును జనవరి 19న, విశాఖపట్నం – చర్లపల్లి ప్రత్యేక రైలును జనవరి 18న రెండు సర్వీసులు, 19 తేదీన ఒక సర్వీసు, చర్లపల్లి – విశాఖపట్నం ప్రత్యేక రైలును జనవరి 19, 20 తేదీన నడపనుంది. చర్లపల్లి – భువనేశ్వర్ ప్రత్యేక రైలును జనవరి 19న రైల్వే శాఖ నడపనుంది.
ప్రత్యేక రైళ్లు ఆగే రైల్వే స్టేషన్లు
కాకినాడ టౌన్ – చర్లపల్లి ప్రత్యేక రైలు సామర్లకోట, రాజమండ్రి నిడదవోలు, తణుకు, భీవరం టౌన్, ఆకివీడు, కైకలూరు, గుడివాడ, రాయనపాడు, ఖమ్మం, డోర్నకల్, మహబూబాబాద్, వరంగల్, కాజీపేట్, జనగామ స్టేషన్లలో ఆగనుంది.
నర్సాపూర్ – చర్లపల్లి ప్రత్యేక రైలు పాలకొల్లు, భీమవరం జంక్షన్, భీమవరం టౌన్, ఆకివీడు, కైకలూరు, గుడివాడ, రాయనపాడు, ఖమ్మం, వరంగల్, కాజీపేట్, జనగామ స్టేషన్లలో ఆగనుంది.
విశాఖపట్నం – చర్లపల్లి మధ్య నడిచే ప్రత్యేక రైళ్లు దువ్వాడ, అనకాపల్లి, ఎలమంచిలి, తుని, అన్నవరం, సామర్లకోట, రాజమండ్రి, నిడదవోలు, తాడేపల్లిగూడెం, ఏలూరు, విజయవాడ, గుంటూరు, సత్తెనపల్లి, పిడుగురాళ్ల, నడికుడి, మిర్యాలగూడ, నల్గొండ స్టేషన్లలో ఆగనున్నాయి.
చర్లపల్లి – భువనేశ్వర్ ప్రత్యేక రైలు నల్గొండ, మిర్యాలగూడ, గుంటూరు, విజయవాడ, తాడేపల్లిగూడెం, నిడదవోలు, రాజమండ్రి, సామర్లకోట్, దువ్వాడ, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం రోడ్, పలాస, బ్రహ్మపూర్, బలుగాన్, ఖర్దా రోడ్ స్టేషన్లలో ఆగనుంది.