by Suryaa Desk | Sat, Jan 18, 2025, 11:38 AM
తెలుగు దేశం పార్టీ వ్యవస్థాపకులు, దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు 29వ వర్ధంతి సందర్భంగా కుటుంబ సభ్యులు, రాజకీయ ప్రముఖులు, అభిమానులు ఘనంగా నివాళులర్పించారు. హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ఘాట్‌కు వెళ్లి కుటుంబసభ్యులు నివాళి అర్పించారు. ఎన్టీఆర్ వర్ధంతిని పురస్కరించుకుని ఆయన మనవళ్లు జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ ఎన్టీఆర్ ఘాట్‌లో పుష్పాంజలి ఘటించారు. ఘాట్ వద్ద కాసేపు జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ ఉన్నారు. జూనియర్ ఎన్టీఆర్‌ని చూసేందుకు ఘాట్ వద్దకు అభిమానులు భారీగా తరలి వచ్చారు. ఎన్టీఆర్ ఘాట్‌లో సమాధి చుట్టు తిరిగి పూలతో జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ నివాళులు అర్పించారు. ఎన్టీఆర్‌కు నివాళులు అర్పించి ఇద్దరు వెళ్లిపోయారు.ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ ఫ్యాన్స్, టీడీపీ కార్యకర్తలు కూడా పార్టిసిపేట్ చేశారు. ప్రతి ఏడాది ఎన్టీఆర్ జయంతి, వర్ధంతి సమయంలో జూనియర్ ఎన్టీఆర్.. హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ఘాట్ వద్దకు చేరుకుని తన తాతయ్యకు నివాళులు అర్పిస్తారు. నందమూరి ఫ్యామిలీతో పాటు నారా కుటుంబం కూడా ఎన్టీఆర్ ఘాట్ వద్దకు వచ్చి నివాళులర్పిస్తారు.