by Suryaa Desk | Sat, Jan 18, 2025, 02:49 PM
ముషీరాబాద్ నియోజకవర్గంలోని అశోక్ నగర్ లోని కొండా లక్ష్మణ్ బాబూజీ నివాసం దగ్గర ప్రజా పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో శాసనసభ్యులు శ్రీ ముఠా గోపాల్ నూతన క్యాలెండర్ ఆవిష్కరించారు. యువ నాయకుడు ముఠా జైసింహ, కాంగ్రెస్ నాయకుడు గుర్రం చంద్రకళ దంపతులు, సంఘం అధ్యక్షుడు సంజీవ్ కుమార్, కార్యదర్శి బింగి నవీన్, పున్న సత్యనారాయణ, ఏం రాకేష్ కుమార్, మీడియా ఇన్ ఛార్జ్ మచ్చకుర్తి ప్రభాకర్, వంశి, అరుణ శ్రీ తదితరులు పాల్గొన్నారు