by Suryaa Desk | Sat, Jan 18, 2025, 11:31 AM
తెలుగు రాష్ట్రాల్లో ఉల్లి ధరలకు మళ్లీ రెక్కలొచ్చాయి. సాధారణంగా వంటల్లో చిన్నరకం ఉల్లినే ఉపయోగిస్తారు. అయితే ఈ రకం పంట దిగుబడి అమాంతం పడిపోయింది. దీంతో ఈ మధ్య కాలంలో ఉల్లి రేట్లు విపరీతంగా పెరిగిపోయాయి. మూడు నెలలకు ముందు రూ.20 ఉన్న ధర ఇప్పుడు పలుచోట్ల కిలో రూ.50 వరకూ అమ్ముతున్నారు. మున్ముందు ఈ రేట్లు మరింత పెరిగే అవకాశం ఉంది. కర్ణాటకలో ఇప్పటికే కిలో రూ.100కు అమ్ముతున్నారు.ఇక కర్ణాటకలో అయితే ఇప్పటికే కిలో రూ. 100కు అమ్ముతున్నారు. అలాగే ఏపీ, తెలంగాణ సరిహద్దు కర్ణాటక పరిధిలోనూ రూ. 100కు విక్రయిస్తున్నారు. దిగుబడి తగ్గడంతో అటు విదేశాలకు కూడా ఎగుమతి తగ్గించింది. ఈ ప్రభావంతో ఉల్లి ధరలు కొనకుండానే కళ్లు మండిపోతున్న పరిస్థితికి చేరుకుంటున్నాయి. దీంతో వినియోగదారులు లబో దిబో మంటున్నారు. ఉల్లి ధరలపై ప్రభుత్వాలు ముందుగానే దృష్టి పెట్టాలని అంటున్నారు. ఉల్లి కొరత కారణాలు తెలుసుకుని ప్రజలపై భారం పడకుండా చూడాలని కోరుతున్నారు.