by Suryaa Desk | Sat, Jan 18, 2025, 12:58 PM
అమీన్పూర్ : అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని బీరంగూడ ప్రాంతంలో కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి సహకరించాలని కోరుతూ శుక్రవారం సాయంత్రం బీరంగూడ ప్రాంతానికి చెందిన పుర ప్రముఖులు, ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేగూడెం మహిపాల్ రెడ్డికి వినతిపత్రం అందించారు. శరవేగంగా అభివృద్ధి చెందుతున్న బీరంగూడ ప్రాంతంలో ప్రజల అవసరాల కోసం కమ్యూనిటీ హాల్ లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. 993 ప్రభుత్వ సర్వే నంబర్ లో కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి భూమిని కేటాయించాలని కోరారు. ఇందుకు సానుకూలంగా స్పందించినఎమ్మెల్యే జిఎంఆర్.. ప్రభుత్వంతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో అమీన్పూర్ మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ నరసింహ గౌడ్, ఎడ్ల రమేష్, ఆదెల్లి రవీందర్, వివిధ పార్టీల నాయకులు, పుర ప్రముఖులు పాల్గొన్నారు