by Suryaa Desk | Sat, Jan 18, 2025, 06:48 PM
తెలుగుజాతి వైభవాన్ని దేశ నలుమూలలు తెలియజేసిన మహోన్నత వ్యక్తి ఎన్టీఆర్ అని టీడీపీ నియోజకవర్గ ఇన్ ఛార్జ్ కృష్ణయ్య అన్నారు. శనివారం ఉమ్మడి ఏపీ మాజీ సీఎం, టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ 29వ వర్ధంతిని పట్టణంలో ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాస్, బ్రహ్మచారి, సీతారాములు, రాజేష్, శ్రీను, రవి, తదితరులు పాల్గొన్నారు.