by Suryaa Desk | Sat, Jan 18, 2025, 06:44 PM
గుర్రంపోడు మండల పరిధిలోని వద్దిరెడ్డిగూడెం వద్ద ఏఎమ్మార్పీ కెనాల్ లో శనివారం గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. స్థానికుల ద్వారా సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.
కాగా మృతదేహం కుళ్ళిపోయిన స్థితిలో ఉందని, మృతుని వివరాలు తెలిస్తే సీఐ 8712670228, ఎస్సై 8712670157 నెంబర్లకు సమాచారం ఇవ్వాలని పోలీసులు తెలిపారు.