by Suryaa Desk | Sat, Jan 18, 2025, 12:54 PM
ఆన్ లైన్ లోన్ యాప్ వేధింపులతో ఇల్లందు పట్టణానికి చెందిన లోద్ సంతోష్ శుక్రవారం రాత్రి పురుగుల మందు తాగి బలవన్మరణానికి యత్నించాడు. సంతోష్ ఆన్ లైన్ లోన్ యాప్ ల ద్వారా 90 వేల రూపాయలు లోన్ తీసుకున్నాడు.నెలవారీగా కడుతూ 48 వేల వరకు లోన్ క్లియర్ చేశాడని కుటుంబ సభ్యులు తెలిపారు. అతని ఆరోగ్య పరిస్థితి సరిగా లేకపోవడంతో లోన్ కట్టకపోయాడన్నారు. దీంతో యాప్ నిర్వాహకులు నిత్యం ఫోన్లు చేస్తూ వేధించడం మొదలుపెట్టారన్నారు. లోన్ కట్టకపోతే కుటుంబ సభ్యుల ఫోటోలను మార్ఫింగ్ చేసి తెలిసిన వారందరికీ పంపుతామని బెదిరించారన్నారు. తన వల్ల తన కుటుంబం పరువు పోతుందని బాధతో సంతోష్ పురుగుల మందు సేవించి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడని తెలిపారు. కుటుంబ సభ్యులు వెంటనే అతనిని ఇల్లందు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించామన్నారు. అతని పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.