by Suryaa Desk | Sat, Jan 18, 2025, 06:52 PM
ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించి, స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపే లక్ష్యంగా ప్రతి కార్యకర్త కృషి చేయాలని ఎమ్మెల్యే బాలు నాయక్ అన్నారు.
శనివారం మండలకేంద్రంలో నిర్వహించిన పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సంక్షేమ పథకాలు అర్హులకు అందేలా చూడాల్సిన బాధ్యత కార్యకర్తలదేనన్నారు. ఈ కార్యక్రమంలో సిరాజ్ ఖాన్, కృష్ణయ్య, తదితర నేతలు పాల్గొన్నారు.