by Suryaa Desk | Sat, Jan 18, 2025, 04:15 PM
కుటుంబ వివాదాల నేపథ్యంలో నటుడు మంచు మనోజ్ నేడు రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ని కలిశారు. ఆస్తుల విషయంలో నటుడు మోహన్ బాబు ఫ్యామిలీలో గొడవలు జరుగుతున్న విషయం తెలిసిందే. సంక్రాంతి సమయంలోనూ మరోసారి కుటుంబ వివాదాలు బయటపడ్డాయి. ఈ నేపథ్యంలోనే ఒకరిపై మరోకరు ఫిర్యాదులు కూడా ఇచ్చారు. అయితే మనోజ్‌పై తన తండ్రి మంచు మోహన్ బాబు ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణలో భాగంగా ఈరోజు రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ముందు హజరయ్యాడు మనోజ్. ఈ విచారణలో ఇటీవల చోటు చేసుకున్న సంఘటనల గురించి మనోజ్ వివరించాడు.జల్‌పల్లిలోని తన నివాసాన్ని కొందరు ఆక్రమించుకున్నారని.. తన ఆస్తుల్లో ఉంటున్న వారిని ఖాళీ చేయించాలని కోరుతూ.. కొన్ని రోజుల క్రితం మోహన్ బాబు జిల్లా మేజిస్ట్రేట్‌ని ఆశ్రయించిన విషయం తెలిసిందే. అయితే మోహన్ బాబు ఫిర్యాదు మేరకు జల్‌పల్లిలో నివాసం ఉంటున్న మనోజ్‌కు కలెక్టర్ నోటీసులు పంపించారు. దీంతో ఈ ఫిర్యాదుకు సంబంధించి కలెక్టర్ ముందు విచారణకు హాజరు అయ్యాడు మనోజ్.