by Suryaa Desk | Sat, Jan 18, 2025, 11:11 AM
హైదరాబాద్ హబ్సిగూడలో విషాదం చోటు చేసుకుంది. నాచారం పోలీస్ స్టేషన్ పరిధి హబ్సిగూడ సైంటిస్ట్ కాలనీలో కరెంట్ షాక్ తో ఇద్దరు కూలీలు మృతి చెందిన విషాద సంఘటన చోటు చేసుకుంది.ఓ చిట్‌ఫండ్ కంపెనీకి సంబంధించి హోర్డింగ్ దించేందుకు బాలు కూలికి వచ్చాడు. సహాయం కోసం రామంతాపూర్‌లో ఉన్న మల్లేశ్‌ను పిలిచాడు. భవనం 2వ అంతస్తులోని హోర్డింగ్‌ను దింపేందుకు వారు ప్రయత్నించారు. ఈ క్రమంలో హోర్డింగ్ జారి అక్కడే ఉన్న 11 కేవీ విద్యుత్ తీగలపై పడింది. దీంతో ఇద్దరికి షాక్ కొట్టి ఘటనాస్థలంలోనే మృతిచెందారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు.స్థానికుల వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది హుటాహుటిన సహాయక చర్యలు చేపట్టారు. కానీ, అప్పటి తీవ్ర నష్టం జరిగిపోయింది. ఇద్దరు కూలీలు అక్కడికక్కడే మృతిచెందారు. మృతిచెందిన ఇద్దరు కూలీలు బాలు (37), మల్లేశ్ (29)లుగా గుర్తించారు. వీరి స్వస్థలం తుంగతుర్తి మండలం, జైన్ గూడ, సూర్యాపేట జిల్లాగా తెలిసింది. మృతులను పోస్టుమార్టం నిమిత్తం గాంధీ హాస్పిటల్ కు తరలించారు..