by Suryaa Desk | Sat, Jan 18, 2025, 02:47 PM
ప్రభుత్వం చేపట్టిన వివిధ పథకాల కార్యక్రమాలకు సంబంధించి అర్హుల జాబితా ఎంపికకు చేపట్టిన సర్వే పనులు రెండు రోజులో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష స్పష్టం చేశారు. శనివారం పెద్దపల్లిలోని బంధంపల్లిలో జరుగుతున్న రేషన్ కార్డ్, రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్ల సర్వే పనులను కలెక్టర్ పరిశీలించారు. అర్హుల ఎంపిక ప్రక్రియ సర్వే 2 రోజులలో పూర్తి కావాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.