by Suryaa Desk | Sat, Jan 18, 2025, 04:06 PM
పసి పాపకు సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడింది అంబులెన్స్ సిబ్బంది. మెదక్ ప్రభుత్వ ఆసుపత్రిలో అప్పుడే పుట్టిన పాపకు ఊపిరి ఆడక ఇబ్బంది పడడంతో 108 వాహనంలో నిలోఫర్ ఆసుపత్రికి తరలించింది వైద్య సిబ్బంది.మార్గమధ్యలో గుండె ఆగిపోవడంతో సీపీఆర్ చేసి పసి పాప ప్రాణాలు కాపాడారు అంబులెన్స్ టెక్నీషియన్ రాజు. హైదరాబాద్ నిలోఫర్ ఆసుపత్రిలో చేర్చడంతో నిలకడగా పాప ఆరోగ్యం ఉంది.