by Suryaa Desk | Mon, Jan 20, 2025, 07:08 PM
కామారెడ్డి నియోజకవర్గంలోని పలువురు అనారోగ్య బాధిత కుటుంబాలకు సోమవారం సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా మంజూరైన చెక్కులను సీనియర్ కాంగ్రెస్ నేత, ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ చేతుల మీదుగా పంపిణీ చేశారు.
అనారోగ్య బారిన పడిన బాధితులు ఎవరైనా ఉంటే ఆస్పత్రికి సంబంధించిన ఒరిజినల్ బిల్లులతో సీఎం రిలీఫ్ ఫండ్ కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ప్రభుత్వం ఆర్థిక సహాయం అందిస్తుందన్నారు.