by Suryaa Desk | Mon, Jan 20, 2025, 05:37 PM
విద్యార్థుల జీవితాలతో రాష్ట్ర ప్రభుత్వం చెలగాటమాడుతోందని బీఎస్ఎఫ్, బిజివీఎస్, బీసీ విద్యార్థి సంఘల నాయకులు అన్నారు. సోమవారం వనపర్తి జిల్లా కేంద్రంలోని విద్యార్థి సంఘలా ఆధ్వర్యంలో ధర్నా చౌక్ నుంచి ర్యాలీగా వెళ్లి కలెక్టరేట్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు.
అనంతరం కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. ప్రభుత్వం తక్షణమే విద్యాశాఖ మంత్రిని నియమించాలని డిమాండ్ చేశారు.