by Suryaa Desk | Mon, Jan 20, 2025, 03:44 PM
తాడూర్ మండలానికి సంభందించిన 21 మంది రైతులకు ప్రభుత్వ సబ్సిడీ కింద మంజూరు అయిన స్ప్రింక్లర్లను ఎమ్మెల్యే డా. కూచుకుళ్ల రాజేష్ రెడ్డి సోమవారం అందజేశారు. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం రైతాంగానికి పెద్ద పీట వేస్తుందన్నారు. వ్యవసాయ యాంత్రీకరణను రైతాంగానికి మరింత దగ్గర చేయడానికి ప్రయత్నిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో రైతులు, నాయకులు పాల్గొన్నారు.