by Suryaa Desk | Mon, Jan 20, 2025, 02:48 PM
ఈరోజు నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పలు కాలనీలలో సుమారు 8.69 కోట్ల రూపాయల నిధులతో నూతనంగా చేపట్టనున్న సిసి రోడ్డు, బీటీ రోడ్డు, భూగర్భ డ్రైనేజీ పనులకు ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ గారు, ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి గారితో కలిసి శంకుస్థాపన చేశారు. శంకుస్థాపన కార్యక్రమంలో భాగంగా నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి భవ్యస్ ఆనందం అపార్ట్మెంట్ నుంచి హిల్ కౌంటి (2.80 కోట్లు) వరకు సీసీ రోడ్డు, హిల్ కౌంటి నుంచి రాజీవ్ గాంధీ నగర్ (1.89 కోట్లు) వరకు సీసీ రోడ్డు, వార్డ్ నెంబర్ 15,16 & 20 పరిధిలోని జయదీపిక ఎన్క్లేవ్ నుంచి పూజిత ఎంక్లేవ్ (1.20 కోట్లు) వరకు చేపట్టనున్న సిసి రోడ్డు పనులు, తెలుగు యూనివర్సిటీలో (1.20 కోట్లు) చేపట్టనున్న బీటీ రోడ్డు పనులు, ప్రగతి నగర్ ప్రధాన రహదారిలో (80 లక్షలతో) చేపట్టనున్న బీటీ రోడ్డు పనులు, ప్రగతి నగర్ కమాన్ నుంచి శ్రీకృష్ణ కాలనీ మీదుగా లోహిత అపార్ట్మెంట్ వరకు (80 లక్షలతో) చేపట్టనున్న భూగర్భ డ్రైనేజీ పనులకు ఎమ్మెల్యే గారు,ఎమ్మెల్సీ గార్లు శంకుస్థాపన నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ గారు మాట్లాడుతూ.... గత పదేళ్ల బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో శివారు మున్సిపాలిటీలు, కార్పొరేషన్లపై కేటీఆర్ గారు ప్రత్యేక శ్రద్ధ వహించి, ఒక ప్రణాళిక బద్ధంగా ముందుకెళ్ళామని, దీనిలో భాగంగా హైదరాబాద్ నగరంలోనే నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ ను మోడ్రన్ కార్పొరేషన్ గా కోట్లాది రూపాయల నిధులతో అభివృద్ధి పరచామని అన్నారు.
ఈ కార్యక్రమంలో మేయర్ కొలన్ నీలా గోపాల్ రెడ్డి, డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్, ఎన్ఎంసి మున్సిపల్ కమిషనర్ సాబేర్ అలీ, కార్పొరేటర్లు బాలాజీ నాయక్, గాజుల సుజాత, ఆగం రాజు, ప్రణయ ధనరాజ్ యాదవ్, రాఘవేందర్ రావు, బొర్ర దేవి చందు, రవి కిరణ్, పైడి మాధవి, కో ఆప్షన్ సభ్యులు ఏనుగు అభిషేక్ రెడ్డి, సలీం, చంద్రగిరి జ్యోతి సతీష్, ఎన్ఎంసి బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రంగరాయ ప్రసాద్, డివిజన్ అధ్యక్షులు సతీష్ రెడ్డి, జశ్వంత్, బొబ్బ శీను, నాయకులు ఆనంద్ రెడ్డి, కుమార్ రెడ్డి, యూత్ అధ్యక్షులు ప్రవీణ్ గౌడ్, మహిళా అధ్యక్షురాలు అర్పిత ప్రకాష్, నాయకులు విష్ణువర్ధన్, ఎస్.కె. ఖాన్, స్వామి, షేఖ్ సలీం, విద్యాసాగర్, సాంబశివరెడ్డి, వైయస్సార్, బిక్షపతి, దశరథ్, మహిళా నాయకురాలు స్వర్ణ, కృష్ణ మంజరి, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.