by Suryaa Desk | Mon, Jan 20, 2025, 05:23 PM
జోగులాంబ గద్వాల జిల్లా పరిధిలోని జమ్మిచేడులో వెలిసిన జమ్ములమ్మకు మంగళవారం విశేష పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు కృష్ణా నది జలాలతో అమ్మవారి విగ్రహాన్ని అభిషేకించి, ఆర్చన, హోమం తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించారు.
అనంతరం భక్తులకు దర్శన భాగ్యం కల్పించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. మంగళవారం సందర్భంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుండి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు.