by Suryaa Desk | Mon, Jan 20, 2025, 05:12 PM
ప్రస్తుత పరిస్థితుల్లో నేటి సమాజానికి సంస్కారం నేర్పేది విద్య మాత్రమే అని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. సోమవారం రంగారెడ్డి జిల్లా షాద్ నగర్‌లో గ్రంథాలయ అభివృద్ధి కమిటీ నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి జూపల్లి హాజరై మాట్లాడారు.
గ్రంథాలయాల్లో మహనీయుల పుస్తకాలు ఉండాలన్నారు. అభివృద్ధికి నిధులు కేటాయించినప్పుడు అందులో నుండి 10% గ్రంథాలయాలకు ఉపయోగించాలన్నారు.