by Suryaa Desk | Sat, Jan 18, 2025, 08:23 PM
మారుతున్న కాలానికి అనుగుణంగా సాంకేతికత అందిపుచ్చుకుని అభివృద్ధి చెందాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. శనివారం సిద్దిపేట జిల్లా కోహెడ మండలంలోని పలు అభివృద్ధి కార్యక్రమాలకు, శంకుస్థాపనలు, పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం కోహెడ మండల కేంద్రంలోని ఓపెన్ జిమ్‌ను ప్రారంభించి ఓపెన్ జిమ్‌లో పలు ఎక్సర్ సైజ్‌లు చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు.