by Suryaa Desk | Sat, Jan 18, 2025, 08:24 PM
ఆదిలాబాద్ నియోజకవర్గ ఇన్ ఛార్జ్ కంది శ్రీనివాస రెడ్డి క్యాంపు కార్యాలయంలోని ప్రజా భవన్ లో కాంగ్రెస్ పార్టీ జిల్లా సీనియర్ నాయకులు నరేష్ రెడ్డి జన్మదిన వేడుకలు శనివారం సాయంత్రం కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో ఘనంగా నిర్వహించారు. అనంతరం కేఎస్ఆర్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో నరేష్ రెడ్డి అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఎల్లవేళలా అండగా ఉంటుందని వారు తెలిపారు.