by Suryaa Desk | Sat, Jan 18, 2025, 07:47 PM
తెలంగాణలో భారీ పెట్టుబడులు పెట్టేందుకు ఎస్‌టీటీ గ్లోబల్ డేటా సెంటర్ ముందుకు వచ్చింది. రాష్ట్రంలో రూ.3,500 కోట్లు పెట్టుబడులు పెట్టేందుకు ఈ సంస్థ రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. మంత్రి శ్రీధర్ బాబు సమక్షంలో ఒప్పందం కుదిరింది.సింగపూర్‌లోని ఎస్‌టీటీ డేటా సెంటర్స్ కార్యాలయంలో ఈ కార్యక్రమం జరిగింది. ఎంవోయూపై ఎస్‌టీటీ సీఈవో బ్రూనో సంతకాలు చేశారు. ఎస్‌టీటీ ఇప్పటికే హైటెక్ సిటీలో ఓ డేటా సెంటర్‌ను నిర్వహిస్తోంది. ఇప్పుడు ముచ్చర్లలోని మీర్‌ఖాన్‌పేట్‌లో మరో డేటా సెంటర్‌ను ఏర్పాటు చేయనుంది. సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ హైదరాబాద్ డేటా సెంటర్ హబ్‌గా మారుతోందన్నారు. ఎస్‌టీటీ డేటా సెంటర్ నిర్ణయాన్ని ఆయన స్వాగతించారు.