by Suryaa Desk | Sat, Jan 18, 2025, 08:30 PM
రేషన్ కార్డుల జారీ నిరంతర ప్రక్రియ అని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో అర్హులకు రేషన్ కార్డులు అందేవరకు ఈ ప్రక్రియ కొనసాగుతూనే ఉంటుందన్నారు. ఇప్పుడు కొత్త రేషన్ కార్డుల జాబితాలో పేర్లు రానివారు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. కులగణన, సామాజిక, ఆర్థిక సర్వే వివరాల ఆధారంగా, పాత రేషన్ కార్డుల సమాచారం ప్రకారం అర్హుల పేర్లు నమోదు చేసినట్లు చెప్పారు. అర్హులని భావించినవారు.. ఎవరికైనా కార్డులు రాకపోతే గ్రామ సభల్లో మళ్లీ దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. దరఖాస్తు చేసుకున్న అర్హులందరికీ రేషన్ కార్డులు జారీ చేస్తామన్నారు.