by Suryaa Desk | Sat, Jan 18, 2025, 07:46 PM
ఆర్టీసీ బస్సులో ఓ మహిళా ప్రయాణికురాలు రెచ్చిపోయింది. బస్సులో అడ్డంగా లగేజీ మూట పెట్టటమే కాకుండా.. తీసేయమని చెప్పిన కండక్టర్ కాలర్ పట్టుకుంది. 'నా మూట నా ఇష్టం ఇక్కడ్నే పెడతా.. కావాలంటే రేవంత్ రెడ్డికి చెప్పుకో పో' అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. వివరాల్లోకి వెళితే.. నిర్మల్ డిపోకు చెందిన పల్లె వెలుగు బస్సు నిర్మల్ నుండి బైంసాకు గతరాత్రి ఏడు గంటలకు బయలుదేరింది. బైంసా మండలం దేగామ్ గ్రామానికి చెందిన ఎల్క బాయి అనే మహిళ లగేజీతో బస్సులో ఎక్కింది. కండక్టర్ డీఆర్ స్వామి లగేజీ దారిలో నుంచి తీసేయాలని సూచించాడు. లేదంటే బస్సు దిగిపోవాలన్నాడు. దీంతో రెచ్చిపోయిన మహిళ కండక్టర్ కాలర్ పట్టుకొని రచ్చ చేసింది.