by Suryaa Desk | Mon, Jan 20, 2025, 07:31 PM
పెద్దపల్లి ఐటిఐ సెంటర్ ప్రాంగణంలో జరుగుతున్న ఏటిసి భవన నిర్మాణ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు.
సోమవారం పెద్దపల్లి ఐటిఐ ప్రాంగణంలో జరుగుతున్న ఏటిసి భవన నిర్మాణ పనులను పరిశీలించారు. ఏటిసి భవన నిర్మాణ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని, నెలాఖరులోపు నిర్మాణ పనులు పూర్తి చేసి పరికరాలను అమర్చెందుకు అందుబాటులోకి తేవాలన్నారు. ఐటిఐ ప్రిన్సిపాల్ వెంకట్ రెడ్డి పాల్గొన్నారు.