by Suryaa Desk | Mon, Jan 20, 2025, 04:50 PM
రైతు జంగు సైరాన్ సభకు అనుమతి నిరాకరించడం ప్రభుత్వం చేతగాని తనానికి నిదర్శనమని బీఆర్ఎస్వి నాయకులు కత్తుల జై. చందన్ మండిపడ్డారు.
సోమవారం నల్గొండ జిల్లా కేంద్రంలో ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది గడిచినా ఇప్పటి వరకు రైతుబంధు రైతు బీమా లేదని రాష్ట్రంలో పూర్తిగా రుణమాఫీ అవ్వలేదని బీఆర్ఎస్ రైతుల పక్షాన పోరాడుతుంటే ప్రభుత్వం అణిచివేయడం సిగ్గుచేటని అన్నారు.