by Suryaa Desk | Mon, Jan 20, 2025, 02:56 PM
తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. 'అధికారంలోకి వచ్చిన ఏడాదికే లక్షా 40 వేల కోట్లు అప్పు తెచ్చి ఏం చేశారు.
ఒక కొత్త ఇటుక పెట్టినవా, ఒక కొత్త పైప్ లైన్ వేసినావా, ఒక కాలువ తవ్వినవా, ఒక కార్మికుడికి లాభం తెచ్చావా, ఒక ఆడబిడ్డకు రూ.2500 ఇచ్చావా, తులం బంగారం ఇచ్చవా..?' అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు.