by Suryaa Desk | Mon, Jan 20, 2025, 02:29 PM
నల్గొండ జిల్లా మునుగోడు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. మునుగోడు ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసును కూలగొట్టి మళ్లీ నిర్మించనున్నారట. ఈ మేరకు సోమవారం ఉదయం క్యాంపు కార్యాలయాన్ని కూలగొట్టించారట. ఇదంతా ఎందుకంటే ఆయనకు మంత్రి పదవి రావడం లేదని, క్యాంపు ఆఫీసుకు వాస్తుదోషం ఉందనే వార్తలు వైరల్ అవుతున్నాయి. అయితే ఇది నిజమో.. కాదో? అనే దానిపై పూర్తి క్లారిటీ రావాల్సి ఉంది.