by Suryaa Desk | Mon, Jan 20, 2025, 03:41 PM
యాదాద్రి జిల్లా మోత్కూరు మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ చైర్ పర్సన్ గుర్రం కవిత అధ్యక్షతన సోమవారం సమావేశం ఏర్పాటు చేశారు. తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రతి సంవత్సరం కస్తూర్బా స్కూలు వద్ద మినీ స్టేడియంలో ఆటల పోటీలు, ముగ్గుల పోటీలు నిర్వహించుటకు గాను రెండు లక్షల రూపాయలు కేటాయించుటకు తీర్మానించారు. అదేవిధంగా చెరువుకట్ట వద్ద అమరవీరుల స్థూపం ఏర్పాటు చేయనున్నారు.