by Suryaa Desk | Mon, Jan 20, 2025, 07:24 PM
ఎన్నికల సమయంలో తాము ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తెలిపారు. సోమవారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో ఆయన మాట్లాడుతూ.."ఇచ్చిన మాట ప్రకారం వ్యవసాయ కూలీలకు రూ.12వేల ఆర్థిక సాయం అందిస్తున్నామన్నారు.
BRS నేతలు ప్రతి జిల్లాకు వెళ్లి అసత్యాలు ప్రచారం చేస్తున్నారు. ప్రభుత్వ పథకాలపై బీఆర్ఎస్ నేతల దుష్ప్రచారం తగదు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే రైతులకు మేలు జరిగింది." అని అన్నారు.