by Suryaa Desk | Mon, Jan 20, 2025, 04:04 PM
వరంగల్‌లో కేసీఆర్ ప్రభుత్వం నిర్మించిన కాళోజీ కళాక్షేత్రం తలుపులు ప్రారంభోత్సవం కోసం తెరుచుకున్నాయని, ఆ తర్వాత మూసిన తలుపులు మళ్లీ తెరుచుకోవడం లేదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఆమె విమర్శలు గుప్పించారు. కాళోజీ కళాక్షేత్రాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించి చేతులు దులుపుకుందని విమర్శించారు. దీనిని పూర్తిస్థాయిలో వినియోగంలోకి తీసుకురాకపోవడాన్ని ఆమె తప్పుబట్టారు.వరంగల్ నగర ప్రతిష్ఠను పెంచేందుకు కేసీఆర్ ప్రభుత్వం కాళోజీ క్షేత్రాన్ని ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిందన్నారు. కాళోజీ కళాక్షేత్రం తన ఘనతగా చిత్రీకరించేందుకు సీఎం రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. దీనిపై చూపించిన శ్రద్ధ... దానిని వినియోగంలోకి తీసుకు రావడంపై పెడితే బాగుంటుందన్నారు.