by Suryaa Desk | Mon, Jan 20, 2025, 02:44 PM
ప్రొఫెసర్ హరగోపాల్ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నామని మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఇది ప్రజాపాలన కాదు, నిర్బంధ పాలన అన్నారు. ఆయన సోమవారం మీడియాతో మాట్లాడారు.
నాగర్ కర్నూల్ జిల్లా మైలారంలో మైనింగ్‌కు వ్యతిరేకంగా గ్రామస్తులు చేస్తున్న నిరసనకు మద్దతు తెలిపేందుకు వెళ్లిన హరగోపాల్‌ను అరెస్టు చేయడం సరికాదన్నారు. ప్రజా పాలన, ప్రజాస్వామ్య పునరుద్దరణ అంటూ గప్పాలు కొట్టి, ఇప్పుడు ప్రజా సంఘాల నాయకుల గొంతులు నొక్కడం ఏంటని ప్రశ్నించారు.