by Suryaa Desk | Mon, Jan 20, 2025, 02:52 PM
నల్గొండలో రేపటి కేటీఆర్ రైతు మహాధర్నాకు పోలీసుల అనుమతి నిరాకరించిన విషయం తెలిసిందే. అయితే ఎట్టి పరిస్థితుల్లోను ధర్నా నిర్వహించి తీరుతామని బీఆర్ఎస్ నేతలు అంటున్నారు.
హైకోర్టును ఆశ్రయించేందుకు బీఆర్ఎస్ నేతలు సన్నద్ధం అవుతున్నారు. గతంలో క్లాక్ టవర్ వేదికగానే ఎన్నో నిరసన కార్యక్రమాలు చేపట్టారని.. ఇప్పుడు కొత్తగా వచ్చిన అభ్యంతరాలు ఏంటని బీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు.