by Suryaa Desk | Mon, Jan 20, 2025, 05:40 PM
మానవపాడు మండలంలోని పలు గ్రామాల్లో గత పది రోజులుగా నీటి సరఫరా నిలిచిపోవడంతో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
గతంలో మిషన్ భగీరథ పథకం ద్వారా గ్రామాలకు నీరు అందుతుండగా, ఇప్పుడు అదే పథకంలో జాప్యం రావడం వల్ల ప్రజలు తాగునీటి కొరతతో ఇబ్బందులు పడుతున్నారని వారు తెలిపారు. గ్రామస్తులు, ప్రత్యేకించి మహిళలు, నీటి కోసం దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు.