by Suryaa Desk | Mon, Jan 20, 2025, 07:14 PM
ప్రజావాణికి వచ్చే దరఖాస్తుదారుల అర్జీలను సంబంధిత శాఖల అధికారులు పరిశీలించి చర్యలు చేపట్టాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు.
సోమవారం కలెక్టరేట్లో జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లాలోని పలు ప్రాంతాల ప్రజలు వారి సమస్యలపై దరఖాస్తులు సమర్పించారు. పలు సమస్యలపై 56 దరఖాస్తులు వచ్చాయని కలెక్టర్ వెల్లడించారు.