by Suryaa Desk | Mon, Jan 20, 2025, 07:10 PM
హైదరాబాద్‌లోని బుద్ధ భవన్‌లో గల హైడ్రా కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమంలో ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ప్రతి సోమవారం ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించేలా హైడ్రా ప్రజావాణి కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈరోజు ప్రజావాణి కార్యక్రమం సందర్భంగా పెద్ద ఎత్తున ఫిర్యాదులు వచ్చాయి.బాధితుల నుంచి హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ఫిర్యాదులను స్వయంగా స్వీకరించారు. అందిన ఫిర్యాదులపై విచారణ చేపట్టాలని అధికారులకు హైడ్రా కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. సాయంత్రం ఆరు గంటల వరకు ప్రజావాణి ఫిర్యాదుల స్వీకరణ ఉంటుంది.కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక, హైదరాబాద్ నగరంలోని చెరువులు, ప్రభుత్వ భూములను కాపాడేందుకు హైడ్రాను ఏర్పాటు చేసింది. హైడ్రాకు పలు అధికారాలను కట్టబెట్టింది. ఈ క్రమంలో చెరువులను ఆక్రమించి కట్టిన నిర్మాణాలను హైడ్రా కూల్చివేస్తోంది.