by Suryaa Desk | Mon, Jan 20, 2025, 04:13 PM
అమెరికాలో మరో తెలుగు యువకుడు మృతి చెందాడు. వాషింగ్టన్ లో దుండగులు జరిపిన కాల్పుల్లో కొయ్యాడ రవితేజ అనే యువకుడు మరణించాడు. రవితేజ స్వస్థలం హైదరాబాదు చైతన్యపురి పరిధిలోని ఆర్కేపురం గ్రీన్ హిల్స్ కాలనీ. రవితేజ తండ్రి పేరు కొయ్యాడ చంద్రమౌళి. రవితేజ మృతితో అతడి కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. ఉన్నత విద్యాభ్యాసం కోసం రవితేజ రెండేళ్ల కిందట అమెరికా వెళ్లాడు. మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసిన అతడు ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నాడు. ఇంతలోనే, ఈ కాల్పుల ఘటనలో ప్రాణాలు కోల్పోయాడు.